Sri MahaKameswari Peetam

ఓం శ్రీ మాత్రే నమః

srimahakeswaripeetam
srimahakeswaripeetam 2020-01-17T16:20:54+00:00
Loading...
contact for more details…
శ్రీ మహాకామేశ్వరి పీఠం
దేవి నవరాత్రి పూజలు
శ్రీ లలితా రహస్య సహస్రనామ పారాయణం

|| ఓం శ్రీ మాత్రే నమః ||

అంతటా నిండి ఉన్నస్వరూపము యొక్క శక్తిని ఆరాదిస్తూ సకల మానవాళి యొక్క కష్టములు సమస్యలు సురముచేయడం బాధ్యతగా ఒక సరైన వేదిక కావాలి కాబట్టి ఏర్పాటు చేసినదే కామేశ్వరి పీఠము. ఈ పీఠము భక్తులు ఆధ్యాత్మిక గమనములో ఉన్నత శికరాలు చేరుకోవడానికి ఒక వేదిక.

కామేశ్వరి అంటే కోరిన కోరికలు తీర్చే తల్లి. ఆవిడ శ్రీ చక్ర అధిష్టాన దేవతయై బాసిల్లుతూ శాక్తేయంలో శ్రీవిద్యగా ఆరదింపబడుతు పిల్లల్లో బాల త్రిపురసుందరిగా, కన్యల్లో కుమారిగా, స్త్రిలల్లో సువాసినిగా, గురువులలో దక్షిణామూర్తి రూపిణిగా, ఇలా అంతటా ఆవిడగా కనిపించకుండా, అదృశ్యముగా ఉంటూ భక్తులను అనుగ్రహిస్తూ కనిపించు దేవతయే శ్రీ మహాకామేశ్వరి అమ్మవారు

దేవి నవరాత్రి పూజలు

21st SEPTEMBER to 29th SEPTEMBER

0
0
0
0
Days
0
0
Hrs
0
0
Min
0
0
Sec

|| శ్రీ మాత్రే నమః ||

శ్రీ మహా కామేశ్వరీ పీఠం లో  శ్రీ శారదా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబ  నామ  సంవత్సర అశ్వయుజ శుద్ధ పాడ్యమి  అనగా (20-09-2017  ) అశ్వయుజ శుద్ధ దశమి(30-09-2017) వరకు అత్యంత వైభోవోపేతముగా నిర్వహించబడును

అంతేకాకుండా  ప్రతి సంవత్సరము లాగే ఈ సంవత్సరం కుడా దేవి నవరాత్రములలో శ్రీ మహా  కామేశ్వరీ పీఠం లో    ప్రతి రొజు ఆర్థిక విద్య ఉద్యోగ వ్యాపార సంతాన అరోగ్య వివాహ సమస్యలకే కాకుండ వారి వారి  కోరికల మేరకు విశేష హోమములు నిర్వహించబడును  కావున  భక్తులు  ఈ అవకాశమును సద్వినియోగ పరుచుకోగలరు

నవరాత్రుల వివరాలు :

21-09-2017 – గురువారం : కుమారి – ఈ రొజు అమ్మవారి ఆరాధన వలన దారిద్ర దుఃఖ నాశనము

22-09-2017 – శుక్రవారం :త్రిమూర్తి –  దీర్ఘాయువు , ధర్మార్ధ కామాలు

23-09-2017 – శనివారం : కళ్యాణి – విద్య, రాజభోగము

24-09-2017 – ఆదివారము : రోహిణి – రోగనాశనము

25-09-2017 – సోమవారం : కాళీ  – శత్రునాశనము

26-09-2017 – మంగళవారం : చండిక – సంపత్కరము

27-09-2017 – బుధవారం : శాంభవి – ధీశక్తి

28-09-2017 – గురువారము: దుర్గ – కార్యసాధన

29-09-2017 – శుక్రవారం :సుభద్ర – అభీష్టఫలదాయిని

30-09-2017 – శనివారం : శ్రీ రాజరాజేశ్వరి దేవి  (సకలకార్యసిద్ధి )

మొదటి రొజు కార్యక్రమాలు  ఉదయం గం”05:00లకు గణపతిపూజతో ప్రారంభం గురుపూజ,  గోపూజ, పుణ్యాహవచనము,  పంచగవ్య ప్రాసన, అంకురార్పణ, దీక్షాధారణ  కలశస్థాపన,ఉదయము గం”09: 00లకులలితా త్రిపురసుందరి కి మహా కామేశ్వరుడుకి పంచామృత  అభిషేకము సహస్రనామార్చన ఉదయము గం: 10:30లకుయాగశాల ప్రవేశము పరివారదేవతాహోమాలు ఆజ్యపూర్ణాహుతి  మహా నివేదన  తీర్థప్రసాద వితరణ

ప్రతి నిత్యమూ జరుగు కార్యక్రమాలు ఉదయము గం” 07:00 లకు గణపతిపూజ  గురువందనము కామేశ్వర సహిత   లలిత త్రిపుర  సుందరికి     విశేష అభిషేకం సహస్రనామార్చన

ఉదయము గం: 09:00 లకు ఇష్టి హొమము అజ్యపూర్ణాహుతి నివేదన తీర్థప్రసాద వితరణ

సాయంత్రము గం”05:15 లకు లలితా సహస్ర నామ హోమము,  గం”06:00 లకు . సహస్ర నామార్చన విశేష అరతులు మహామంత్రపుష్పము చతుర్వేదస్వస్తి అనుగ్రహభాషణం.సంగీత నృత్య వాద్యసేవ ఉంజల్ సేవ  తీర్థప్రసాద గోష్ఠి

దుర్గాష్టమి

(28-09-2017) నాడు బాలపూజ,  లక్షకుంకుమార్చన

మహర్నవమి నాడు (29-09-2017) ఉదయముగం 06:30 ని”లకుసువాసిని పూజగం” 08:00లకు చండీహోమము గం”10:30.ని”లకు

మహాకామేశ్వర సహిత శ్రీ లలిత త్రిపురసుందరి కి  విశేష అభిషేకం  పుష్పయాగము గం 12:15.ని”లకు మహాపూర్ణాహుతి  మహా మంత్రపుష్పం చతుర్వేదస్వస్తి మహదాశీర్వచనము తీర్థప్రసాద వితరణ,సంతర్పణ

సాయంత్రము గం”06:00లకు శాంతికళ్యాణము ,ఊరేగింపు ఉంజలసేవ

విజయదశమి (30-09-2017) ఉదయము గం 08:00లకు అష్టోత్తరశతకలశాభిషేకము సహస్రనామార్చన శాంతి హోమము

సాయంత్రము : గం”06:00లకు అర్చన సాంప్రదాయ గురువందనం శమీపూజ పండిత సన్మానం విజయానుగ్రహం

శ్రీ లలితా రహస్య వంగృప సహస్రనామ పారాయణం

ప్రతి ఒక్కరికి దేవి కటాక్షం కలిగే లాగా శ్రీ మహాకామేశ్వరి పీఠం అమ్మవారి ఆశిర్వాదంతో ఒక ఒక బృహత్తర కార్యక్రమం ప్రారంభం చేసింది. శ్రీ లలితా రహస్య వంగృప యజ్ఞం అని ఇందులో బాగముగా మొదట 1008 గృహాలలో లలితా సహస్రనామ పారాయణం స్వయముగా నేనే వెళ్లిచేస్తాను, నా యొక్క గొంతుతో ఇప్పటికే 500 ఇళ్ళల్లో హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్, పాలకొల్లు, మెదక్ మొదలగు పట్టణాలలో ఈ యొక్క పారాయణం చేయడం జరిగింది.

శ్రీ హిరణ్య శర్మ గారు

శ్రీ హిరణ్య శర్మ గారు దేవి భక్తులు మరియు ఉపాసకులు. శ్రీ తురుమెళ్ళ వరలక్ష్మి, శ్రీ తురుమెళ్ళ మృత్యుంజయ శర్మ గార్లకు మచిలిపట్టనంలో జన్మించినారు.

బాల్యంనుండి కూడా ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన శ్రీ హిరణ్య శర్మను ఎన్నో ప్రశ్నలు వేదించేవి, అందులో ముఖ్యముగా భక్తుల ప్రార్ధనలు భగవంతునికి ఏ విదంగా చేరుతాయో, అసలు చేరవో అని తీవ్రంగా మధనపడేవారు. ఒక రోజు గుడిలో ఒక వనిత చాల దీనంగా భగవంతుని వేడుకోవడం కనిపించి చాలా బాధకు గురి అయ్యారు, అసలు భగవంతుడు వింటున్నాడా, వింటున్నాడనుకుంటే మనకెలా తెలుస్తుంది, ఎలా అర్ధమవ్వాలి, ఏమి చెయ్యాలి అని అనేక ప్రశ్నల వెల్లువలోనుంచి ఒక స్పష్టత ఏర్పడింది, ఒక్క సారిగా తను చేయాల్సిన పని ఏమిటో సుస్పష్టంగా తెలిసినట్టయ్యింది.

అమ్మ వారు జగదంబక ఆజ్ఞతో, ఆశిర్వాదముతో, నలుగురికి మంచి చెయ్యాలి అనే నిస్వార్ధ బుద్దితో, ఉపాసన మార్గములో కామేశ్వరి పీతము స్థాపించి భక్తులను ఉపాసన మార్గములో నడిపించడమే ధ్యేయముగా ముందుకు సాగిపోతున్నారు. పీటమునందు భక్తులకు విశేష పూజలు, యాగములు, ఉపాసన దీక్షలు, దోష నివారణ సంకల్పములు జరపబడుచున్నవి

SUBSCRIBE TO OUR EMAIL NEWSLETTER

FOLLOW US IN OUR SOCIAL NETWORKS